ఇరు రాష్ట్రాల సిఎంలకు ‘శ్రీమంతుడు’ స్పెషల్ షో

ఇరు రాష్ట్రాల సిఎంలకు ‘శ్రీమంతుడు’ స్పెషల్ షో

Published on Jul 21, 2015 8:41 AM IST

modi-kcr-chandhra-babu

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘శ్రీమంతుడు’. షూటింగ్ తో పాటు ఆడియో రిలీజ్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. మహేష్ బాబు ఈ సారి అభిమానులకు కావాల్సిన కమర్షియల్ అంశాలను అందిస్తూనే ఓ సోషల్ మెసేజ్ ని కూడా ఇవ్వనున్నాడు. అదే ఉద్యోగాలు వచ్చి ఎక్కడెక్కడో వెళ్లి సెటిల్ అయ్యి పండగలకి పబ్బాలకి మాత్రమే సొంత ఊరికి రావడం కాదని.. వెలకట్టేలేని ఆస్తిని ఇచ్చిన సొంత ఊరికి మన తరపున ఏదో ఒకటి తిరిగివ్వాలని చెప్తూనే ఓ ఊరిని దత్తత తీసుకోవాలి అనే కాన్సెప్ట్ ని ఇందులో చూపించనున్నారు.

ఇలాంటి ఓ స్ట్రాంగ్ కంటెంట్ ని చెబుతుండడంతో ఈ చిత్ర టీం ఈ సినిమా ఇరు రాష్టాల ముఖ్యమంత్రులైన నారా చంద్రబాబు నాయుడు మరియు కె చంద్రశేఖర్ రావు లకు ప్రత్యేకంగా షో వేసి చూపించాలి అనుకుంటున్నారు. అలాగే మన ప్రధాని కూడా ‘ఊరు దత్తత తీసుకోవడం’ అనే పాయింట్ పైన ప్రచారం చేస్తున్నారు. కావున ఆయనకి కూడా ఓ స్పెషల్ షో వెయ్యాలని భావిస్తున్నారు. ఆయనకి నఃహిన కాన్సెప్ట్ కావున సినిమా కూడా బాగా నచ్చుతుందని ఈ చిత్ర టీం అంటోంది. ఈ విషయంపై ఈ చిత్ర టీం త్వరలోనే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసి సినిమా చూడటానికి ఆహ్వానించనున్నారు.

మహేష్ బాబు సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి మిర్చి ఫేం కొరటాల శివ డైరెక్టర్. మైత్రి మూవీస్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమా ఆగష్టు 7న రిలీజ్ కానుంది.

తాజా వార్తలు