యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నరేష్ అగస్త్య, జాతి రత్నాలు బ్యూటీ ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన సినిమా “గుర్రం పాపిరెడ్డి”. ఈ సినిమా డిసెంబర్ 2025లో విడుదలైంది. ఈ సినిమాకి థియేటర్లలో సాధారణ స్పందన లభించినా.. పాన్-ఇండియా స్థాయిలో ఓటీటీలో మాత్రం ఈ చిత్రానికి మెరుగైన స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమా టెలివిజన్ ప్రీమియర్ తేదీని కూడా ఫిక్స్ చేసుకుంది. ఈ చిత్రం ఫిబ్రవరి 8, 2026న సాయంత్రం 6 గంటలకు జీ తెలుగులో ప్రసారం కానుంది.
కాగా ఈ చిత్రాన్ని డా. సంధ్య గోలీ సమర్పణలో ప్రొడ్యూసర్స్ వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మించారు. డార్క్ కామెడీ కథతో దర్శకుడు మురళీ మనోహర్ రూపొందించారు. పైగా ఈ ‘గుర్రం పాపిరెడ్డి’ లో ప్రధాన పాత్రలందరూ మంచి పెర్ఫామెన్స్ లని అందించారు. అలాగే అక్కడక్కడా మంచి ఫన్ ట్రాక్స్ ఇందులో బాగున్నాయి. మరి టెలివిజన్ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో చూడాలి.


