వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తోన్న టాలెంటెడ్ డైరెక్టర్ !

Published on May 26, 2020 2:00 am IST

హీరో కమ్ డైరెక్టర్ రాహుల్ ర‌వీంద్ర‌న్ తన మొదటి సినిమా ‘చి.ల.సౌ’తోనే మంచి హిట్ అందుకున్నాడు. పైగా జాతీయ అవార్డును కూడా గెలుచుకుంది ఆ సినిమా. కాగా ప్రస్తుతం తన కొత్త స్క్రిప్ట్‌ను పూర్తి చేసే దిశలో ఉన్నాడు రాహుల్. అయితే స్క్రిప్ట్ రాస్తోంది సినిమా కోసం కాదు, వెబ్ సిరీస్ కోసమట. నెట్‌ఫ్లిక్స్ కోసం ఒరిజినల్ వెబ్ సిరీస్‌ కు దర్శకత్వం వహించబోతున్నాడట. ఈ వెబ్ సిరీస్ లో వెన్నెల కిషోర్ నటించబోతున్నాడు. అయితే ఈ వెబ్ సిరీస్ కి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ఇక హారిక అండ్ హాసిని క్రియేషన్స్ లో భాగమైన ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ సితారా ఎంటర్టైన్మెంట్స్‌ లో రాహుల్‌ ఓ సినిమా చేయబోతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. మొదట హీరోగా ఎంట్రీ ఇచ్చిన రాహుల్ ర‌వీంద్ర‌న్ ప్రస్తుతం డైరెక్టర్ గా బిజీ అవుతుండటం విశేషం. అయితే తన రెండో చిత్రంగా కింగ్ నాగార్జున హీరోగా, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌ గా మ‌న్మ‌థుడు 2ను తెరకెక్కించాడు. రొమాంటిక్ ఎంట‌ర్‌ టైన‌ర్ గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేకపోయింది.

సంబంధిత సమాచారం :

More