గత ఏడాది విడుదలైనా ‘దేవిశ్రీ ప్రసాద్’ అనే చిత్రం గుర్తుందా..? ఆ చిత్ర దర్శకుడు పేరే శ్రీకిషోర్. ఈయన గతంలో ‘సశేషం, భూ’ లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇప్పుడు `మై ఇండియన్ బాయ్‌ఫ్రెండ్` అనే చైనీస్ చిత్రాన్ని తీయబోతున్నారు. చైనా వెళ్లిన ఇండియన్ అబ్బాయికి.. అక్కడ పరిచయమైనా చైనీస్ అమ్మాయికి మధ్య భావోద్వేగంతో కూడుకున్న ఒక అందమైన ప్రేమకథే ‘ఈ చిత్రం’ అంటున్నారు దర్శకుడు శ్రీకిషోర్.
శ్రీకిశోర్ ఈ చిత్రం గురించి మాట్లాడుతూ.. తాను 2012 నుంచి హాంగ్ కాంగ్‌లోనే ఉంటున్నానని, అక్కడే ఓ చైనీస్ అమ్మాయిని కూడా ప్రేమించి పెళ్లిచేసుకున్నానని చెప్పారు. అంటే తన జీవితకథనే చిత్ర కథగా మలచబోతున్నారన్నమాట. ఇప్పటివరకు తెలుగు సినిమాలకి మాత్రమే దర్శకత్వం వహించిన ఈయన త్వరలో ఓ చైనీస్ సినిమాకు దర్శకత్వం వహించే ఏర్పాట్లలో ఉన్నారు. ఈ చిత్రంతోనైనా శ్రీకిషోర్ కి సరైన విజయం రావాలని ఆశిద్దాం.
