తమ స్టాండ్‌ను మరోసారి వెల్లడించిన తెలుగు ఫిలిం ఛాంబర్

తమ స్టాండ్‌ను మరోసారి వెల్లడించిన తెలుగు ఫిలిం ఛాంబర్

Published on May 23, 2026 10:33 PM IST

ticket rates

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సానాల లేటెస్ట్ చిత్రం ‘పెద్ది’ విడుదలకు ఎలాంటి అడ్డంకులు ఎదురుకాకూడదని తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ తమ స్టాండ్‌ను మరోసారి స్పష్టం చేసింది. తెలంగాణ ఎగ్జిబిటర్లు ‘పర్సంటేజ్ సిస్టమ్’ తెస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో, ఈ సినిమా సాఫీగా థియేటర్లలోకి వచ్చేలా ఛాంబర్ పూర్తి మద్దతు ప్రకటించింది. దీంతో జూన్ 4న ఈ చిత్రం గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

ఇండస్ట్రీలో మొదటి నుండి ‘పర్సంటేజ్ షేరింగ్’ విధానానికి గట్టి మద్దతుదారుడిగా ఉన్న ప్రముఖ నిర్మాత, ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ డి.సురేష్ బాబు ఈ నిర్ణయాన్ని ఆమోదిస్తూ తన సంతకం చేశారు. ‘పెద్ది’ సినిమా సేఫ్ రిలీజ్‌కు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు పెద్ద ఊరట లభించినట్లయింది.

ఎగ్జిబిటర్లు కోరుతున్న పర్సంటేజ్ సిస్టమ్‌కు సంబంధించిన నియమ నిబంధనలను జూన్ చివరి నాటికి చర్చించి ఖరారు చేయాలని ఫిలిం ఛాంబర్ నిర్ణయించింది. దీనివల్ల ‘పెద్ది’ సినిమా ప్రస్తుతానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా పాత పద్ధతిలోనే విడుదల కాబోతోంది. జూలై నుండి రాబోయే ఇతర పెద్ద సినిమాలకు మాత్రం జూన్ చివర్లో తీసుకునే కొత్త నిర్ణయాలు వర్తించనున్నాయి.

తాజా వార్తలు