మే 29న ప్రేక్షకుల ముందుకు ‘సందిగ్ధం’

తీర్థ క్రియేషన్స్ బ్యానర్‌పై పార్థసారధి కొమ్మోజు దర్శకత్వంలో తెరకెక్కిన విభిన్న కథాచిత్రం ‘సందిగ్ధం’ విడుదలకు సిద్ధమైంది. సంధ్య తిరువీధుల నిర్మించిన ఈ సినిమాను మే 29న గ్రాండ్‌గా థియేటర్లలోకి తీసుకురానున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాలో నిహాల్, ప్రియా దేశ్ పాగ్, అర్జున్ సిహెచ్, కాజల్ తివారి, నవీన్ రాజ్ సంకరపు ప్రధాన పాత్రలు పోషించారు.

​ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించి, సినిమాపై ఆసక్తిని పెంచాయి. ప్రస్తుతం షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే సెన్సార్ కార్యక్రమాలను జరుపుకోనుంది. రాబోయే రోజుల్లో ప్రమోషన్స్ వేగవంతం చేసి ప్రేక్షకులకు మరింత చేరువకావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

​ఈ చిత్రానికి గౌతమ్ రవి రామ్ సంగీతం సమకూర్చగా, నందన్ కృష్ణ సినిమాటోగ్రఫీ, విశ్వన్ రాజ్. డిఎస్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. జీవా కొచెర్ల, చిట్టి బాబు, ఆనంద్ భారతి, రైజింగ్ రాజు, అప్పారావు తదితరులు ఇతర కీలక పాత్రల్లో మెప్పించనున్నారు.

Exit mobile version