సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న ‘సుగ్రీవ’.. ఏప్రిల్ 24న విడుదల

sugrua

ఎస్ జి ఎస్ వి మూవీస్ పతాకంపై ఎం. పవన్ కుమార్ నిర్మాణంలో, నర్తు చిరంజీవి దర్శకత్వంలో తెరకెక్కిన సస్పెన్స్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం ‘సుగ్రీవ’. బాలు చరణ్, కాజల్ తివారీ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా సెన్సార్‌తో సహా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఏప్రిల్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్భంగా చిత్ర బృందం మాట్లాడుతూ.. ఆనందంగా జీవిస్తున్న ఒక కుటుంబంలో ఎదురయ్యే అనుకోని సంఘటనలు, వాటి వల్ల వారు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు అనే ఇతివృత్తంతో ఈ సినిమాను రూపొందించినట్లు తెలిపారు. నిర్మాత ఎం. పవన్ కుమార్ ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారని, దర్శకుడు నర్తు చిరంజీవి టేకింగ్ అద్భుతంగా ఉందని వారు పేర్కొన్నారు.

యాక్షన్ సన్నివేశాలతో పాటు, గోవా, వైజాగ్ లాంటి అందమైన లొకేషన్లలో చిత్రీకరించిన పాటలు ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. సారథి స్టూడియోస్‌లో డీఐ, సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో సాయి కృప, సుమన్ శెట్టి, ఆర్ఎక్స్ 100 కరణ్ విజయ్, గగన గీతిక తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Exit mobile version