కర్నాటక బుల్ డోజర్స్ ని డీ కొట్టనున్న తెలుగు వారియర్స్

కర్నాటక బుల్ డోజర్స్ ని డీ కొట్టనున్న తెలుగు వారియర్స్

Published on Mar 10, 2013 10:00 AM IST

CCL-3-Telugu-Warriors

తెలుగు వారియర్స్ టీం ప్రస్తుతం జరుగుతున్న సిసిఎల్ – 3 సీరస్ ఫైనల్స్ కి చేరుకుంది. నిన్న సాయంత్రం హైదరాబాద్లో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో వీర్ మరాఠీ టీం పై 75 పరుగుల ఆధిక్యంతో గెలిచింది. తెలుగు వారియర్స్ టీంకి విక్టరీ వెంకటేష్ కెప్టెన్ గా వ్యవహరించగా మ్యాచ్ విజయంలో తేజ, ఆదర్శ్, ప్రిన్స్ లు ముఖ్య పాత్ర పోషించారు. సెమీ ఫైనల్స్ లో సాధించిన ఈ విజయంతో ఈ రోజు సాయంత్రం బెంగుళూరు లో జరగనున్న ఫైనల్స్ మ్యాచ్ లో తెలుగు వారియర్స్ టీం కర్నాటక బుల్ డోజర్స్ తో తలపడనుంది.

ఇంతక ముందు జరిగిన మ్యాచ్ లో తెలుగు వారియర్స్ టీం కర్ణాటక బుల్ డోజర్స్ చేతిలో ఓడిపోవడంతో ఫైనల్ మ్యాచ్ ఎవరు గెలుస్తారా అనే ఆసక్తి నెలకొంది. చార్మీ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న తెలుగు వారియర్స్ టీంలో రామ్ చరణ్, నిఖిల్, శ్రీకాంత్, తరుణ్ లు కూడా ముఖ్యమైన ప్లేయర్స్. కర్నాటక బుల్ డోజర్స్ కి సుదీప్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు