టెంపర్ హిందీ రీమేక్ షూటింగ్ పూర్తి చేసుకుంది !

టెంపర్ హిందీ రీమేక్ షూటింగ్ పూర్తి చేసుకుంది !

Published on Nov 7, 2018 7:25 PM IST

తెలుగులో సూపర్ హిట్ అయిన ‘టెంపర్’ చిత్రం రణ్వీర్ సింగ్ హీరోగా ‘సింబా’ అనే టైటిల్ తో బాలీవుడ్ లో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా గోవా లో జరిగిన చివరి షెడ్యూల్ తో ఈచిత్రం యొక్క షూటింగ్ పూర్తి అయింది. ఈచిత్రంలో కొత్త లుక్ లో కనిపించనున్నాడు రణ్వీర్ సింగ్.

రోహిత్ శెట్టి తెరకెక్కిస్తున్న ఈచిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. కరణ్ జోహార్, రోహిత్ శెట్టి కలిసి నిర్మిస్తున్న ఈచిత్రంలో సారా అలీ ఖాన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ చిత్ర ట్రైలర్ ను డిసెంబర్ 3న విడుదలచేసి చిత్రాన్ని డిసెంబర్ 28న ప్రేక్షకులముందుకు తీసుకువచ్చేలా సన్నాహాలు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు