చెన్నైలోనూ అదరగొడుతున్న ‘టెంపర్’

చెన్నైలోనూ అదరగొడుతున్న ‘టెంపర్’

Published on Feb 13, 2015 3:29 PM IST

temper
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ఫుల్ లెంగ్త్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించిన సినిమా ‘టెంపర్’. నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురు చూసిన ఈ సినిమా ఈ రోజు ప్రప్రంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆంధ్ర, తెలంగాణ బెనిఫిట్ షో నుంచే ఈ సినిమాకి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. తెలంగాణలోనే కాకుండా తమిళనాడు, చెన్నైలో కూడా భారీ ఎత్తున భారీ ఎత్తున రిలీజ్ అయ్యింది. టెంపర్ తెలుగులోలానే చెన్నైలో కూడా బాక్స్ ఆఫీసు కలెక్షన్స్ రాబట్టుకుంటోంది. చెన్నై అవుట్ స్కర్ట్స్ లో కూడా బెనిఫిట్ షోస్ వేయడంతో ఫస్ట్ వీకెండ్ తమిళనాడులో కూడా రికార్డ్ కలెక్షన్స్ వస్తాయని ట్రేడ్ చెబుతున్నారు.

యంగ్ టైగర్ ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ కి పూరి జగన్నాధ్ డైరెక్షన్, స్క్రీన్ ప్లే, పంచ్ డైలాగ్స్ తోడవడంతో థియేటర్స్ లో ఆడియన్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.వక్కంతం వంశీ కథ అందించిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా, మధురిమ, సోనియా అగర్వాల్ ముఖ్య పాత్రల్లో కనిపించారు. బ్లాక్ బస్టర్ కోసం ఎంతగానో కష్టపడే బండ్ల గణేష్ ఈ సినిమాతో మరోసారి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించాడు.

తాజా వార్తలు