ఓవర్ సీస్ లో భారీరీతిలో విడుదలకానున్న టెంపర్

ఓవర్ సీస్ లో భారీరీతిలో విడుదలకానున్న టెంపర్

Published on Feb 12, 2015 2:17 AM IST

temper1
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో వస్తున్న హై వోల్టేజ్ ఎంటర్టైనర్ ‘టెంపర్’. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రిమియర్ షో లు ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శించనన్నారు. ముఖ్యంగా అమెరికాలో 120 స్క్రీన్స్ లో విడుదలచేయనున్నారు.

ఈ సినిమా నిర్మాత బండ్ల గణేష్ ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 13న విడుదలచేయను న్న విషయం తెలిసినదే. ఈ సినిమా ట్రైలర్ విడుదలైన నాటినుండీ అంచనాలు పెరిగిపోతున్నాయి. అనూప్ రూబెన్స్ సంగీత దర్శకుడు. కాజల్ ఆగర్వాల్ హీరోయిన్ గా నటించింది.

తాజా వార్తలు