రేపు ఉదయం జరగనున్న ‘టెంపర్’ సెన్సార్

రేపు ఉదయం జరగనున్న ‘టెంపర్’ సెన్సార్

Published on Feb 9, 2015 4:26 PM IST

temper
నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ‘టెంపర్’ సినిమా ఫిబ్రవరి 13న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కానుంది. ముందుగా అనుకున్న దాని ప్రకారం ఈ సినిమాకి ఈ రోజు మధ్యాహ్నం సెన్సార్ కార్యక్రమాలు జరగాలి. కానీ ఈ సినిమాకి సంబందించిన చిన్న చిన్న పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కానందు వల్ల ఫస్ట్ కాపీ ఇంకా రెడీ అవ్వలేదు. కావున ఈ సినిమా సెన్సార్ ని రేపటి ఉదయానికి వాయిదా వేసారు. మరి కొద్ది గంటల్లో అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి ఫస్ట్ కాపీ రెడీ చెయ్యడానికి ఈ చిత్ర టీం కంటిన్యూగా వర్క్ చేస్తున్నారు.

ఎన్.టి.ఆర్ కూడా గత రాత్రే ఈ సినిమాకి సంబందించిన డబ్బింగ్ ని ఫినిష్ చేసాడు. సెన్సార్ నుంచి ఎలాంటి రిపోర్ట్ వస్తుందా అని ఈ చిత్ర టీం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. మొదటి సారి ఎన్.టి.ఆర్ పూర్తి స్టైలిష్ లుక్ లో, డిఫరెంట్ డైలాగ్ మాడ్యులేషన్ తో ఫుల్ లెంగ్త్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్న ఈ మూవీకి పూరి జగన్నాధ్ డైరెక్టర్. బ్లాక్ బస్టర్ నిర్మాత బండ్ల గణేష్ నిర్మించిన ఈ సినిమాలో అందాలా భామ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా కనిపిస్తే మధురిమ, సోనియా అగర్వాల్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

తాజా వార్తలు