
నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ‘టెంపర్’ సినిమా ఫిబ్రవరి 13న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కానుంది. ఈ చిత్ర టీం అన్ని పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసి ఫస్ట్ కాపీని సిద్దం చేసింది. ముందుగా ఈ రోజు ఉదయం సెన్సార్ చేయాలనీ అనుకున్నారు, కానీ మొదలు కాలేదు. మాకు అందిన తాజా సమాచారం ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకి సెన్సార్ వారు ఈ సినిమా చూడటానికి సమయం ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. అనగా సాయంత్రం కల్లా ఈ సినిమాకి సెన్సార్ సర్టిఫికేట్ వస్తుంది.
సెన్సార్ నుంచి ఫుల్ పాజిటివ్ రిపోర్ట్ వస్తుందని ఈ చిత్ర టీం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. మొదటి సారి ఎన్.టి.ఆర్ పూర్తి స్టైలిష్ లుక్ లో, డిఫరెంట్ డైలాగ్ మాడ్యులేషన్ తో ఫుల్ లెంగ్త్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్న ఈ మూవీకి పూరి జగన్నాధ్ డైరెక్టర్. బ్లాక్ బస్టర్ నిర్మాత బండ్ల గణేష్ నిర్మించిన ఈ సినిమాలో అందాలా భామ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా కనిపిస్తే మధురిమ, సోనియా అగర్వాల్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

