యుఎస్ లో 1 మిలియన్ మార్క్ టచ్ అవుతున్న ‘టెంపర్’

యుఎస్ లో 1 మిలియన్ మార్క్ టచ్ అవుతున్న ‘టెంపర్’

Published on Feb 19, 2015 1:11 PM IST

temper

తన అభిమానులు కాలర్ ఎగరేసుకొని తిరిగే సినిమా అందించాలనే ఉద్దేశంతో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ఎంతో కసితో చేసిన సినిమా ‘టెంపర్’. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా గత శుక్రవారం విడుదలై బెనిఫిట్ షో నుంచే ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకొని సూపర్ హిట్ అయ్యింది. కేవలం టాక్ పరంగానే కాకుండా కలెక్షన్స్ పరంగా కూడా రికార్డ్స్ సృష్టిస్తోంది. ఒక్క ఆంధ్ర, తెలంగాణాలోనే కాకుండా చెన్నై మరియు ఓవర్సీస్ లో కూడా ఫస్ట్ వీకెండ్ అదిరిపోయే కలెక్షన్స్ ని రాబట్టుకుంది. చాలా రోజుల తర్వాత ఎన్.టి.ఆర్ సినిమా ఓవర్సీస్ లో కలెక్షన్స్ భారీగా కొల్లగొడుతోంది.

మొదటి రోజు ప్రీమియర్స్ తో కలిపి $500 డాలర్స్ సాధించిన టెంపర్ మిగిలిన రోజులు కూడా అదే జోరుతో కలెక్షన్స్ వసూలు చేస్తోంది. అదే మానియాని కంటిన్యూ చేసింది. రిపోర్టెడ్ స్క్రీన్స్ నుంచి మాకు అందిన యుఎస్ బాక్స్ ఆఫీసు విశేషాలను మీకందిస్తున్నాం.

వారం                                           కలెక్షన్స్

గురువారం ప్రీమియర్స్ –                 $ 257K
శుక్రవారం –                                    $ 230K
శనివారం –                                     $ 203K
ఆదివారం –                                    $ 181K
సోమవారం –                                 $ 48K
మంగళవారం –                             $ 19K
మొత్తం –                                      $ 939K

దీని ప్రకారం బుధవారం, గురువారంలతో ఈ సినిమా యుఎస్ లో 1 మిలియన్ మార్క్ ని క్రాస్ చేస్తుందని ట్రేడ్ పండితులు అంటున్నారు. దీంతో ఈ చిత్ర యుఎస్ డిస్ట్రిబ్యూటర్స్ అయిన గ్రేట్ ఇండియా ఫిలిమ్స్ వారు చాలా హ్యాపీగా ఉన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు