
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన తాజా సినిమా ‘టెంపర్’ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం గ్యారెంటీ అని తెలుగు సినీ ఇండస్ట్రీ ప్రముఖులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ సినిమాలో కొన్ని యాక్షన్ సన్నివేశాలను, పాటలను యువ హీరో నితిన్, ప్రకాష్ రాజ్ తదితరులకు దర్శకుడు పూరి జగన్నాధ్ చూపించారు. ఇవి చూసిన తర్వాత సోషల్ మీడియాలో ‘టెంపర్’లో ఎన్టీఆర్ ఇరగదీశాడని.. పోస్ట్ చేశారు. ఈ వ్యాఖ్యలు నందమూరి అభిమానులకు సంతోషాన్ని కలిగించాయి.
ఇటు ఎన్టీఆర్, అటు పూరి జగన్నాధ్ గత సినిమాలు ఆశించిన విజయం సాదించకపోవడంతో, ‘టెంపర్’తో సాలిడ్ సక్సెస్ అందుకోవాలని కృషి చేస్తున్నారు. కసితో ఈ సినిమా చేశానని ఆడియో వేడుకలో ఎన్టీఆర్ చెప్పిన సంగతి తెలిసిందే. ట్రైలర్, సాంగ్ ప్రోమోలు సూపర్ సక్సెస్ కావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. వాటిని అందుకుంటామనే ధీమాను నిర్మాత బండ్ల గణేష్ వ్యక్తం చేశారు.
కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ విలన్ గా నటించారు. అనూప్ రూబెన్స్ సంగీత దర్శకుడు. పరమేశ్వరా ఆర్ట్స్ పతాకంపై బ్లాక్ బస్టర్ నిర్మాత బండ్ల గణేష్ నిర్మించారు. ఈ శుక్రవారం సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

