ప్రతి సినిమాని బ్లాక్ బస్టర్ చేయడం కోసం తపించే నిర్మాత అయిన బండ్ల గణేష్ ‘టెంపర్’ సినిమా బ్లాక్ బస్టర్ పై చాలా నమ్మకంగా ఉన్నాడు. ఆయన ఈ సినిమా సక్సెస్ గురించి మాట్లాడుతూ ‘టెంపర్ సినిమా బ్లాక్ బస్టర్ అనే మీనింగ్ ని రీ డిఫైన్ చేసేలా ఉంటుందని’ అంటున్నారు. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ నటించిన ఈ టెంపర్ సినిమా ఫిబ్రవరి 13న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అవ్వడానికి సిద్దమవుతోంది. ఈ సినిమా విజయంపై బండ్ల గణేష్ భారీగానే నమ్మకం పెట్టుకొని ఉన్నారు.
ఎన్.టి.ఆర్ ఇంతకూ ముందెన్నడూ కనిపించని రీతిలో, ఫుల్ లెంగ్త్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ గ్లామర్ కూడా ఈ సినిమాకి బాగా హెల్ప్ అవుతుందని అంటున్నారు. పూరి జగన్నాధ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిచగా మణిశర్మ నేపధ్య సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం రీ రికార్డింగ్ పనులు చివరి దశలో ఉన్నాయి. త్వరలోనే ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు జరుపుకోనుంది.


