
నందమూరి యంగ్ హీరోలు చెప్పినట్లు ఈ నందమూరి నామసంవత్సరంలో రెండవ బాక్స్ ఆఫీసు బొనంజాగా రావాల్సిన నందమూరి యంగ్ హీరో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ‘టెంపర్’ రిలీజ్ కి ముస్తాబవుతోంది. ఈ సినిమాకి సంబందించిన ఫైనల్ మిక్సింగ్ ఆలస్యం అవడం వలన ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు రేపటికి వాయిదా పడ్డాయి. మాకు అందిన సమాచారం ప్రకారం ఈ సినిమా సెకండాఫ్ కి సంబందించిన ఫైనల్ మిక్సింగ్ పనులు ఈ రోజు సాయంత్రం 5 గంటలకు మొదలయ్యాయి. ఈ రోజు రాత్రికల్లా ఈ ఫైనల్ మిక్సింగ్ ని పూర్తి చేసి ఫస్ట్ కాపీని రెడీ చేయనున్నారు.
ఈ చిత్ర ప్రొడక్షన్ టీం రేపు ఉదయం 9 గంటలకు ఈ ఫస్ట్ కాపీని సెన్సార్ వారికి చూపించనున్నారు. ఈ లెక్క ప్రకారం రేపు మధ్యాహ్నం కల్లా టెంపర్ సెన్సార్ రిపోర్ట్ బయటకు తెలిసిపోతుంది. మరోవైపు ఫిబ్రవరి 13న ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మొదటి సారి ఎన్.టి.ఆర్ పూర్తి స్టైలిష్ లుక్ లో, డిఫరెంట్ డైలాగ్ మాడ్యులేషన్ తో ఫుల్ లెంగ్త్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్న ఈ మూవీకి పూరి జగన్నాధ్ డైరెక్టర్. బ్లాక్ బస్టర్ నిర్మాత బండ్ల గణేష్ నిర్మించిన ఈ సినిమాలో అందాలా భామ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా కనిపిస్తే మధురిమ, సోనియా అగర్వాల్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.