
నందమూరి హీరోలు మరియు నందమూరి అభిమానులు నందమూరి నామసంవత్సరంగా రాసుకోవాలి అనుకుంటున్న ఈ 2015 లో నందమూరి ఫ్యామిలీ నుంచి వస్తున్న రెండవ సినిమా ‘టెంపర్’. ఎన్.టి.ఆర్, అతని టీం సక్సెస్ పై చాలా నమ్మకంగా ఉన్న ఈ సినిమా ఫిబ్రవరి 13న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కావడానికి సిద్దమైంది. ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో బెనిఫిట్ షోస్ కి సంబందించిన ఏర్పాట్లు కూడా జరిగిపోతున్నాయి. అభిమానులతో పాటు సినీ ప్రేమికులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాన్ని మీకందిస్తున్నాం.
మాకు అందిన సమాచారం ప్రకారం ‘టెంపర్’ సినిమా రన్ టైం సుమారు 141 నిమిషాలు ఉంటుంది. ఇదే లెంగ్త్ కి ఈ చిత్ర టీం ఫస్ట్ కాపీని రెడీ చేసారని సమాచారం. అందులో ఫస్ట్ హాఫ్ 1 గంట 8 నిమిషాలు, సెకండాఫ్ 1 గంట 13 నిమిషాలు ఉంటుందని అంటున్నారు. దీని ప్రకారం సినిమా మొత్తం సుత్తి లేకుండా సూటిగా ఉంటుందని ఆశించవచ్చు. ముందుగానే పూరి జగన్నాధ్ కి తన సినిమాలలో స్క్రీన్ ప్లే చాలా స్పీడ్ గ ఉంటుందని అందరికీ తెలిసిందే, ఈ లెక్కన ఈ సినిమా స్క్రీన్ ప్లే చాలా స్పీడ్ గా ఉంటుందని ఆశించవచ్చు. సెన్సార్ అయ్యాక ఒకవేళ ఎక్కడైనా సాగదీసినట్టు అనిపిస్తే, ఒక 5 నిమిషాల సినిమా తగ్గొచ్చు లేదా 141 నిమిషాల సినిమా మన ముందుకు వస్తుంది.
ఎన్.టి.ఆర్ సరసన అందాల భామ కాజల్ అగర్వాల్ హీరోయిన్ కనిపించనున్న ఈ సినిమాలో మధురిమ, సోనియా అగర్వాల్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. బండ్ల గణేష్ భారీ వ్యయంతో నిర్మించిన ఈ సినిమా ఈ రోజు సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకోనుంది.

