“ది ఫ్యామిలీ స్టార్” ఓటిటి రిలీజ్ పై లేటెస్ట్ బజ్

“ది ఫ్యామిలీ స్టార్” ఓటిటి రిలీజ్ పై లేటెస్ట్ బజ్

Published on Apr 17, 2024 6:32 PM IST

టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా దర్శకుడు పరశురామ్ పెట్ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ చిత్రమే “ది ఫ్యామిలీ స్టార్”. మరి ఈ ఉగాది కానుకగా వచ్చిన ఈ చిత్రం అనుకున్న రేంజ్ సక్సెస్ ని సాధించలేదు. దీనితో విజయ్ కెరీర్ లో హిట్ కి బ్రేక్ పడింది. ఇక ఈ చిత్రం ఓటిటి రిలీజ్ కి సంబంధించి లేటెస్ట్ బజ్ వినిపిస్తుంది.

దీని ప్రకారం ఈ చిత్రం ఈ మే 3 నుంచి స్ట్రీమింగ్ కి వచ్చే ఛాన్స్ ఉన్నట్టుగా వినిపిస్తుంది. మరి ఈ సినిమా హక్కులు ప్రముఖ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మరి ఇందులోనే దాదాపు పాన్ ఇండియా భాషల్లో స్ట్రీమింగ్ కి రానున్నట్టుగా టాక్ వినిపిస్తుంది. ఇక ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందించగా దిల్ రాజు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు