ఓటిటి రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న “ఊరు పేరు భైరవకోన”?

ఓటిటి రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న “ఊరు పేరు భైరవకోన”?

Published on Feb 28, 2024 3:38 PM IST

యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా వర్ష బొల్లమ్మ అలాగే కావ్య థాపర్ లు హీరోయిన్స్ గా క్రియేటివ్ దర్శకుడు వి ఐ ఆనంద్ తెరకెక్కించిన లేటెస్ట్ థ్రిల్లర్ డ్రామా “ఊరు పేరు భైరవకోన”. మరి డీసెంట్ ప్రమోషన్స్ నడుమ థియేటర్స్ లోకి వచ్చిన ఈ చిత్రం సందీప్ కిషన్ కెరీర్ లో మంచి వసూళ్లు అయితే రిజిస్టర్ చేసింది. మరి ఈ చిత్రం ఓటిటి రిలీజ్ కి సంబంధించి ఇప్పుడు కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి.

దీని ప్రకారం ఈ చిత్రం ఈ మార్చ్ 15 నుంచి స్ట్రీమింగ్ కి వస్తుంది అని టాక్. మరి ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులని జీ 5 వారు సొంతం చేసుకున్నట్టుగా కూడా టాక్ ఉంది. మరి వీటిపై అయితే అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందించగా రాజేష్ దండ నిర్మాణం వహించారు. అలాగే ప్రముఖ నిర్మాత అనీల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ సమర్పణలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు