ద్విపాత్రాభినయంలో నటిస్తోన్న తమిళ్ స్టార్ ?

ద్విపాత్రాభినయంలో నటిస్తోన్న తమిళ్ స్టార్ ?

Published on Mar 25, 2020 9:06 AM IST

తమిళ్ సూపర్ స్టార్స్ లోనే ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న స్టార్ తల అజిత్. అతి పెద్ద మాస్ ఫ్యాన్ బేస్ ఉన్న ఈ స్టార్ హీరో వరుసగా సూపర్ హిట్స్ అందుకుంటూ తన స్టామినా ఏమిటో తమిళ్ బాక్సాఫీస్ కి ఎప్పటికప్పుడు ప్రూవ్ చేస్తూనే ఉన్నారు. గత కొన్ని సినిమాలుగా అజిత్ చిత్రాలు తమిళంలో వరుస రికార్డ్స్ మీద రికార్డ్స్ సాధిస్తున్నాయి. గత సినిమా విశ్వాసం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఆయన ఆ తరువాత నెర్కొండ పార్వై అనే సినిమాలో లాయర్ గా నటించి మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. కాగా అజిత్ ప్రస్తుతం చేస్తోన్న నూతన చిత్రం పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. వాలిమై అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే కీలకమైన సన్నివేశాల షూటింగ్ పార్ట్ ను పూర్తి చేసుకుంది. కరోనా ప్రభావం తగ్గాక పలు యాక్షన్ సీక్వెన్సెస్ ను ప్లాన్ చేయనున్నారు.

కాగా నెర్కొండ పార్వై అనే సూపర్ హిట్ సినిమాని తెరకెక్కించిన హెచ్ వినోత్ ఈ సినిమాకి కూడా దర్శకత్వం వహించడం విశేషం. మాస్ అండ్ కమర్షియల్ అంశాలతో యాక్షన్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమాలో అజిత్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడట. అందులో ఒక పాత్రలో అజిత్ పోలీస్ అధికారిగా కనిపించబోతున్నారని తమిళ్ సినీ వర్గాల్లో వినిపిస్తోంది. ఏమైనా అజిత్
ద్విపాత్రాభినయంలో ఏమి చేసినా ఆయన ఫ్యాన్స్ కు అది ప్రత్యేకమే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు