పాన్ ఇండియన్ లెవెల్లో రచ్చ చేయనున్న థలా..!

Published on Nov 27, 2020 7:04 am IST

మన దగ్గర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబులకు భారీ కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అదే విధంగా తమిళ్ లో కూడా థలా అజిత్ మరియు థలపతి విజయ్ కు సొంతం. వీరి సినిమాలు వస్తున్నాయి అంటే బాక్సాఫీస్ పంబ రేగాల్సిందే.

అయితే ఇప్పుడు వీరికి ఇంత క్రేజ్ ఉన్నప్పటికీ భారీ వసూళ్లు రాబడుతున్నప్పటికీ పాన్ ఇండియన్ రిలీజ్ మాత్రం ఇంకా లేదు. కానీ ఇప్పుడు థలా అజిత్ ఈ స్టెప్ తీసుకున్నారు. దర్శకుడు హెచ్ వినోథ్ తో తీస్తున్న పవర్ ఫుల్ యాక్షన్ కాప్ డ్రామా “వాలిమై” తాలూకా లేటెస్ట్ వర్కింగ్ స్టిల్ ను బయట పెట్టడంతో భారీ రెస్పాన్స్ వచ్చింది.

ఇక అలాగే ఈ చిత్రం పాన్ ఇండియన్ రిలీజ్ కు కూడా ఫిక్సయ్యినట్టు తెలుస్తుంది. గత కొన్నాళ్ల నుంచి బజ్ అయితే వచ్చింది కానీ సరైన క్లారిటీ లేదు. కానీ ఇప్పుడు అది ఫైనలైజ్ అయ్యినట్టు సమాచారం. అంతేకాకుండా ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవి రేస్ లో భారీ ఎత్తున రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :