లేటెస్ట్ : తలైవర్ 170 టైటిల్ అనౌన్స్ మెంట్ టైం లాక్

లేటెస్ట్ : తలైవర్ 170 టైటిల్ అనౌన్స్ మెంట్ టైం లాక్

Published on Dec 12, 2023 12:13 AM IST


సూపర్ స్టార్ రజినీకాంత్ ఇటీవల జైలర్ మూవీతో ప్రేక్షకాభిమానుల ముందుకి వచ్చి కెరీర్ పరంగా పెద్ద సక్సెస్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం టీజ్ జ్ఞానవేల్ తో తన కెరీర్ 170వ మూవీ చేస్తున్నారు రజినీకాంత్. అమితాబ్ బచ్చన్, రానా దగ్గుబాటి, ఫహద్ ఫాసిల్, రితికా సింగ్, మంజు వారియర్, దూసర విజయన్ వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ మూవీకి అనిరుద్ సంగీతం అందిస్తుండగా లైకా ప్రొడక్షన్స్ సంస్థ దీనిని గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తోంది.

ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ నుండి రేపు సూపర్ స్టార్ రజినీకాంత్ బర్త్ డే సందర్భంగా మూవీ యొక్క టైటిల్ తో పాటు టీజర్ అనౌన్స్ మెంట్ ని సాయంత్రం 5 గం. లకు అందించనున్నట్లు మేకర్స్ కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. ఆకట్టుకునే కథనాలతో రూపొందుతున్న ఈ మూవీ వచ్చే ఏడాది ఆడియన్స్ ముందుకి వచ్చే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు