లోకేష్ “కూలీ” అంచనాలు మిస్ అయ్యిందా!?

లోకేష్ “కూలీ” అంచనాలు మిస్ అయ్యిందా!?

Published on Apr 23, 2024 7:04 AM IST

ప్రస్తుతం సౌత్ ఇండియా సినిమా దగ్గరున్న పలు క్రేజీ కాంబినేషన్ లలో దర్శకుడు లోకేష్ కనగరాజ్ అలాగే సూపర్ స్టార్ రజినీకాంత్ ల కాంబినేషన్ కూడా ఒకటి. మరి ఇది రజినీకాంత్ కెరీర్ లో 171వ సినిమా కాగా లోకేష్ తో అనౌన్స్ చేయడంతో భారీ హైప్ నెలకొంది. మరి నిన్న ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టైటిల్ టీజర్ ని రిలీజ్ చేసి సినిమా ‘కూలీ” అంటూ రివీల్ చేశారు.

అయితే ఇప్పుడు ఈ వీడియో కోసమే మూవీ లవర్స్ లో చర్చ నడుస్తోంది. లోకేష్ నుంచి వచ్చిన గత సినిమాలు “విక్రమ్”, “లియో” రేంజ్ లో అయితే ఇది లేదని సదరు తమిళ్ ఆడియెన్స్ నే చెప్పేస్తున్నారు. వాటిలో చాలా తక్కువ డైలాగ్స్ ఉన్నప్పటికీ కూలీ టీజర్ లో ఏకంగా పెద్ద పెద్ద డైలాగ్స్ స్వయంగా రజినీకాంత్ పైనే యాక్షన్ సీన్స్ ఉన్నా కూడా వాటి రేంజ్ బజ్ ని ఇది తీసుకురాలేకపోయింది.

దీనితో అంచనాలు అందుకోవడంలో ఇది మిస్ అయ్యింది అని చెప్పాలి. మరి ఫుల్ ఫ్లెడ్జ్ సినిమా ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ భారీ చిత్రంకి అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు అలాగే సన్ పిక్చర్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు