రజినీకాంత్ – లోకేష్ కనగరాజు మూవీ టైటిల్ కి డేట్ ఫిక్స్!

రజినీకాంత్ – లోకేష్ కనగరాజు మూవీ టైటిల్ కి డేట్ ఫిక్స్!

Published on Mar 28, 2024 7:00 PM IST


కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ (Lokesh) కనగరాజు లియో (Leo) చిత్రం తో బ్లాక్ బస్టర్ హిట్ సాధించాడు. ఈ చిత్రం తరువాత సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) తో తలైవర్ 171 (Thalaivar 171) ను అనౌన్స్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం నుండి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను మేకర్స్ నేడు రివీల్ చేశారు. ఈ చిత్రం కి సంబందించిన టైటిల్ టీజర్ విడుదల పై క్లారిటీ ఇచ్చారు. ఏప్రిల్ 22 వ తేదీన టైటిల్ ను రివీల్ చేయనున్నట్లు ప్రకటించారు.

అయితే ఇదే విషయాన్ని వెల్లడించడానికి సరికొత్త పోస్టర్ ను విడుదల చేసారు. సూపర్ స్టార్ రజనీకాంత్ లుక్ తో కూడిన ఈ పోస్టర్ విశేషం గా ఆకట్టుకుంటుంది. చేతులకు బేడిలతో, స్టైలిష్ గా ఉన్నారు. ఈ స్టైలిష్ లుక్ కి ఫ్యాన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. సన్ పిక్చర్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుద్ రవి చందర్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు