“తలైవర్ 171” టైటిల్ గ్లింప్స్ కి టైమ్ ఫిక్స్!

“తలైవర్ 171” టైటిల్ గ్లింప్స్ కి టైమ్ ఫిక్స్!

Published on Apr 22, 2024 2:01 PM IST

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ (Lokesh) కనగరాజు లియో (Leo) చిత్రం తో బ్లాక్ బస్టర్ హిట్ సాధించాడు. ఈ చిత్రం తరువాత సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) తో తలైవర్ 171 (Thalaivar 171) ను అనౌన్స్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. నేడు ఈ చిత్రం కి సంబందించిన టైటిల్ టీజర్ విడుదల కానున్నట్లు మేకర్స్ ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా మేకర్స్ టైమ్ ను ప్రకటించారు. ఈరోజు సాయంత్రం 6:00 గంటలకు టైటిల్ గ్లింప్స్ రిలీజ్ కానుంది. ఇదే విషయాన్ని సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు.

మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. ఈ పోస్టర్ ఫ్యాన్స్ ను విశేషం గా ఆకట్టుకుంటుంది. సన్ పిక్చర్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుద్ రవి చందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం కి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు