ఇంట్రెస్టింగ్ టైటిల్ తో ‘తలైవర్ 171’ టీజర్ రిలీజ్

ఇంట్రెస్టింగ్ టైటిల్ తో ‘తలైవర్ 171’ టీజర్ రిలీజ్

Published on Apr 22, 2024 6:30 PM IST

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా ప్రస్తుతం వెట్టయాన్ మూవీ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈమూవీని టీజె జ్ఞానవేల్ తెరకెక్కిస్తుండగా దీనిని అక్టోబర్ లో ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు. ఇక దీని అనంతరం సన్ పిక్చర్స్ బ్యానర్ పై లోకేష్ కనకరాజ్ తో తన కెరీర్ 171వ మూవీని రజినీకాంత్ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి అనిరుద్ సంగీతం అందించనున్నారు.

విషయం ఏమిటంటే, నేడు ఈ పాన్ ఇండియన్ మూవీ యొక్క టైటిల్ ని కూలీ గా ఫిక్స్ చేసి టీజర్ ని రిలీజ్ చేసారు. గోల్డ్ బిస్కెట్స్, వాచెస్ స్మగ్లింగ్ చేసే ముఠా ఆటకట్టించి రజినీకాంత్ పవర్ఫుల్ ఎంట్రీ ఫైట్ తో అదరగొట్టిన ఈ టీజర్ ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటోంది. త్వరలో రెగ్యులర్ షూట్ ప్రారంభం కానున్న కూలీ మూవీ గురించిన మరిన్ని అప్ డేట్స్ ఒక్కొక్కటిగా త్వరలో వెల్లడి కానున్నాయి.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు