ఇళయ థలపతి విజయ్ హీరోగా ప్రస్తుతం దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తో స్టార్ట్ చేసిన భారీ ప్రాజెక్ట్ “బీస్ట్”. భారీ అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రం ఇప్పుడు రెండో కీలక షెడ్యూల్ కూడా స్టార్ట్ చేసుకుంది. అయితే ఈ సినిమా అనంతరం విజయ్ డైరెక్ట్ తెలుగు అండ్ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ కమిట్ అయ్యాడు.
అది కూడా మన టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లితో ప్లాన్ చేశారు. ఇప్పుడు ఈ రెండు సినిమాలు కాకుండా విజయ్ 67 వ సినిమాపై బజ్ స్టార్ట్ అయ్యింది. దీనిని కూడా మన టాలీవుడ్ లో బడా బ్యానర్ లోనే ఈ చిత్రం తెరకెక్కనుందట. అంతే కాకుండా ఈ సినిమా బై లాంగువల్ గా సాలిడ్ యాక్షన్ డ్రామా అని తెలుస్తుంది. మరి దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే విజయ్ బీస్ట్ తో బిజీగా ఉన్నాడు.


