తమిళ నాట విజయ్ క్రేజ్ ప్రతి ఏడాది పెరుగుతూపోతుంది. వరుసగా ఆయన సూపర్ హిట్ మూవీస్ చేయడమే ఇందుకు కారణం. ఇక గతంలో తెలుగులో మార్కెట్ లేని విజయ్ అదిరింది, సర్కార్, బిగిల్ మూవీస్ తో ఇక్కడ కూడా మంచి వసూళ్లు రాబడుతున్నాడు. తెలుగులో విజిల్ గా విడుదలైన బిగిల్ మూవీ ఏకంగా 10కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి హిట్ గా నిలిచింది. అలాగే ఇండియా పరిధిలో 200కోట్ల వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. గతంలో ఈ రికార్డు ప్రభాస్, రజిని, యష్ మాత్రమే సౌత్ నుండి సాధించారు. కాగా విజయ్ ప్రస్తుతం దర్శకుడు లోకేష్ కనకరాజ్ తో ఓ మూవీ చేస్తున్నారు. విజయ్ 64వ చిత్రం గా తెరకెక్కుతున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి.
ఈ మూవీలో విజయ్ కాలేజ్ ప్రొఫెసర్ గా, గ్యాంగ్ స్టర్ గా రెండు భిన్న పాత్రలలో కనిపిస్తారని సమాచారం. విజయ్ మూవీస్ కి ఉన్న డిమాండ్ రీత్యా ఈ చిత్ర శాటిలైట్ రైట్స్ కొరకు తీవ్ర పోటీ నడిచింది. ఐతే ఫ్యాన్సీ ధర చెల్లింది సన్ నెట్ వర్క్స్ విజయ్ మూవీ శాటిలైట్ రైట్స్ దక్కించుకున్నారట. కేవలం చిత్రీకరణ మొదలైన వెంటనే శాటిలైట్ రైట్స్ అమ్ముడు బోవడం విజయ్ క్రేజ్ ఏమిటో చెప్పకనే చెవుతుంది. ఇక ఈమూవీలో విజయ్ సేతుపతి విలన్ రోల్ చేయడం గమనార్హం.


