మరో ఓఎస్టీ ను రిలీజ్ చేసేందుకు సిద్ధమైన థమన్!

మరో ఓఎస్టీ ను రిలీజ్ చేసేందుకు సిద్ధమైన థమన్!

Published on Jun 22, 2024 2:11 AM IST

ఇండియా లో సూపర్ క్రేజ్ ఉన్న సంగీత దర్శకుల్లో మ్యూజికల్ సెన్సేషన్ థమన్ ఒకరు. థమన్ ప్రస్తుతం పలు భారీ చిత్రాలకు సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ చిత్రం యొక్క ఒరిజినల్ సౌండ్ ట్రాక్ రిలీజ్ పై క్లారిటీ ఇచ్చారు. జూన్ 28 వ తేదీన రిలీజ్ చేయనున్నారు. అయితే తాజాగా మరొక ఇంట్రెస్టింగ్ పోస్ట్ ను సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది.

బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన వీరసింహారెడ్డి చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రం కి సంబందించిన ఓఎస్టీ ను త్వరలో రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. ఆ తర్వాత రాధే శ్యామ్, భగవంత్ కేసరి, అఖండ చిత్రాలకి కూడా రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. ఇది ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ అని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు