తమన్ ‘బాలయ్య’ సినిమాకి కూడా !

తమన్ ‘బాలయ్య’ సినిమాకి కూడా !

Published on Dec 5, 2019 4:47 PM IST

నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఒక లేటెస్ట్ అప్ డేట్ తెలిసింది. ఫుల్ ఫామ్ లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ను ఈ సినిమా కోసం మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకున్నారు. ఇప్పటికే ఈ చిత్రం ప్రై ప్రొడక్షన్ కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటుంది.

కాగా ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారట. వారిలో ఒక హీరోయిన్ గా కన్నడ బ్యూటీ శ్రద్ధ శ్రీనాథ్ ను తీసుకోవాలని దర్శక నిర్మతలు అనుకుంటున్నారు. అయితే ఈ సినిమాలో బాలయ్య రెండు పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా ఎమోషనల్ బ్యాక్ డ్రాప్ లో సాగే పక్కా యాక్షన్ ఎంటర్ టైనర్ అట.

ఇక ఇంతకుముందు వీరి కలయికలో వచ్చిన ‘సింహ, లెజెండ్’ చిత్రాలు భారీ విజయాలు సాధించాయి. అలాగే ఈ సినిమా కూడా హిట్ అయితే, వీళ్ళు హ్యాట్రిక్ హిట్ కొట్టినట్లే. మరి ప్లాప్ ల్లో ఉన్న ఈ హిట్ కాంబినేషన్ హిట్ కొడుతుందా ? చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు