
ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు సేకరించడం కోసం, ప్రజలలో హుధూద్ తుఫాన్ కలిగించిన నష్టాలపై అవగాహన కల్పించడం కోసం అక్టోబర్ 19న హార్డ్ రాక్ కేఫ్ లో చారిటీ మ్యూజికల్ షో నిర్వహించనున్నారు. ప్రముఖ స్టైలిష్ డిజైనర్ నీరజ కోన నిర్వహిస్తున్న ఈ మ్యూజికల్ షోలో యువ సంగీత తరంగం ఎస్ ఎస్ తమన్ మరియు ఇతర గాయనీగాయకులు లైవ్ పెర్ఫార్మన్స్ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి యంగ్ స్టార్స్ అక్కినేని నాగ చైతన్య, నితిన్,హన్సికలు హాజరవుతారు.
ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన డబ్బును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేస్తారు. ఈ ఆదివారం 8.30 గంటలకు మ్యూజికల్ షో జరిగే అవకాశం ఉంది. మంచి ఉద్దేశ్యంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి మద్దతు తెలపాలని నీరజ కోన సోషల్ మీడియాలో కోరారు. టికెట్ ధర, కార్యక్రమ సమయం, ఇతర వివరాలను త్వరలో వెల్లడిస్తారు. మరింత సమాచారం కోసం 123తెలుగు.కామ్ చూస్తూ ఉండండి.
విశాఖ, ఉత్తరాంధ్ర జిల్లాలలో హుధూద్ తుఫాన్ వల్ల అపార ఆస్తి నష్టం కలిగింది. ప్రజలు సర్వస్వం కోల్పోయారు. అక్కడ వారికి సరైన త్రాగు నీరు, తిండి, నిత్యావసర వసతులు కూడా లేవు. వారిని ఆడుకోవడం కోసం తెలుగు చలన చిత్ర పరిశ్రమ ప్రముఖులు ఎనలేని కృషి చేస్తున్నారు.