
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న సినిమా ‘బ్రూస్ లీ’. ది ఫైటర్ అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమాలో రామ్ చరణ్ ఓ ఫైట్ మాస్టర్ గా, సినిమాలోని హీరోలకి డూప్ గా కనిపించే పాత్ర పోషిస్తున్న సంగతి ఇది వరకే తెలియజేశాం. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి తన రియల్ లైఫ్ పాత్రలో కనిపించనున్నాడు. సెప్టెంబర్ 12 నుంచి చిరు బ్రూస్ లీ సెట్లో అడుగు పెట్టనున్నాడు. ఈ సినిమాలో చిరంజీవి కి ఓ సాంగ్, ఓ ఫైట్ తో పాటు కొన్ని సన్నివేశాలు ఉంటాయి. ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ అయిన ఎస్ఎస్ తమన్ చిరంజీవి కోసం స్పెషల్ సాంగ్ చెయ్యడానికి సిద్దమయ్యాడు.
‘ బ్రూస్ లీ సినిమా కోసం మొట్ట మొదటది సారి మెగాస్టార్ చిరంజీవి గారి కోసం ఓ సాంగ్ కంపోజ్ చేయబోతున్నాను. చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. సాంగ్ కంపోజింగ్ మీ అందరి ఆశీర్వాదం కావాలని’ తమన్ ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. ఈ రోజు నుంచి తమన్ చిరు కోసం చేయబోయే సాంగ్ పై కసరత్తులు చేస్తున్నాడు. చాలా గ్యాప్ తర్వాత చిరు ఈ సినిమా ద్వారా తెరపై కనిపించనున్నాడు. దాంతో ఈ సాంగ్ ని మరియు సాంగ్ పిక్చరైజేషన్ ని సంథింగ్ స్పెషల్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి శ్రీను వైట్ల డైరెక్టర్. కోన వెంకట్ – గోపి మోహన్ లు కలిసి కథ అందించిన ఈ సినిమాకి డివివి దానయ్య నిర్మాత.

