ఆగడు ఐటెంలో శృతి రోల్ ని ఖరారుచేసిన థమన్

Published on Jun 4, 2014 11:36 pm IST

Sruthi-Hasan
మహేష్ బాబు ‘ఆగడు’ సినిమాలో ఒక కళ్ళుచెదిరే ఐటెంసాంగ్ వుంటుందని ఆ పాటలో మహేష్ సరసన నర్తించేది మరెవరో కాదు శృతిహాసన్ అని ఎప్పట్నుంచో మనకో సర్ప్రైజ్ ఇస్తానన్న థమన్ చివరికి ఈ వార్తని తెలిపాడు

ట్విట్టర్ లో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు. శృతి గ్లామర్ తో ఆకట్టుకోవడమే కాక డ్యాన్స్ తో కనికట్టు కూడా చేయగలుగుతుంది. కాబట్టి ఈ సినిమాలో ఈ పాట ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది అనడంలో సందేహంలేదు. మహేష్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్

శ్రీను వైట్ల దర్శకుడు. 14రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత. ఈ సినిమా దసరాకి మనముందుకు రానుంది

సంబంధిత సమాచారం :