పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు చిత్ర యూనిట్ ఒక అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది. ‘ఓజీ’ సినిమాటిక్ యూనివర్స్ అనుకున్నదానికంటే చాలా వేగంగా పట్టాలెక్కుతోంది. ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ థమన్ తాజాగా జరిగిన ఒక ప్రమోషనల్ ఈవెంట్‌లో ‘ఓజీ 2’ షూటింగ్‌పై అధికారిక ప్రకటన చేశాడు.
ఈ ఏడాది సెప్టెంబర్ నుంచే ‘ఓజీ 2’ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు ఆయన స్పష్టం చేశాడు. ఇటీవలే పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ ఈ ఫ్రాంచైజీ పై అధికారిక ప్రకటన చేస్తూ.. డైరెక్టర్ సుజీత్, పవన్ కల్యాణ్‌ల క్రేజీ మీటింగ్‌కు సంబంధించిన ఫొటోలను పంచుకుంది. అప్పటి నుంచే ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. 2025లో వచ్చిన భారీ బ్లాక్‌బస్టర్ మూవీ ‘దే కాల్ హిమ్ ఓజీ’ లో పవన్ కల్యాణ్‌ను ఒక అల్ట్రా స్టైలిష్ గ్యాంగ్‌స్టర్ అవతారంలో చూపించిన సుజీత్, ఇప్పుడు పార్ట్ 2 లో ‘ఓజస్ గంభీర’ నేపథ్యానికి సంబంధించిన ‘అన్‌టోల్డ్ ఒరిజిన్ స్టోరీ’ని చూపించబోతున్నాడు.
డైరెక్టర్ సుజీత్ ఈ చిత్రం కోసం ఒక భారీ ఇంటర్నేషనల్ అండర్‌వరల్డ్ కథాంశాన్ని సిద్ధం చేస్తున్నాడు. థమన్ సెప్టెంబర్ షెడ్యూల్‌ను కన్ఫర్మ్ చేయడంతో అభిమానులు ఈ సినిమా అప్డేట్స్ కోసం మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
