విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆదర్శ కుటుంబం’. ఈ హిలేరియస్ ఎంటర్‌టైనర్ ప్రాజెక్ట్‌లోకి తాజాగా మరో క్రేజీ టాలెంట్ వచ్చి చేరింది. ఈ విషయాన్ని మ్యూజిక్ డైరెక్టర్ థమన్ వెల్లడించాడు.
టాలెంటెడ్ లిరిసిస్ట్ కిట్టు విస్సాప్రగడ ఈ సినిమాకు పాటలు రాయబోతున్నట్లు ఆయన అధికారికంగా ప్రకటించాడు. సరికొత్త లిరిక్స్, యూత్‌ఫుల్ అండ్ ఎమోషనల్ పాటలు రాయడంలో కిట్టు విస్సాప్రగడకు మంచి గుర్తింపు ఉంది. ఇప్పుడు త్రివిక్రమ్ మార్క్ స్క్రిప్ట్, వెంకటేష్ టైమింగ్ ఉన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో ఆయన భాగం కావడం సినిమాపై మ్యూజిక్ లవర్స్‌లో మరింత ఆసక్తిని పెంచింది. రాధాకృష్ణ, నాగవంశీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది.
చాలా కాలం తర్వాత వెంకటేష్, త్రివిక్రమ్ కాంబో నుండి వస్తున్న సినిమా కావడంతో దీనిపై అటు ఇండస్ట్రీలోనూ, ఇటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ హిలేరియస్ రైడ్‌లోకి కిట్టు విస్సాప్రగడ కూడా తోడవడంతో ఈ కాంబినేషన్ నుండి రాబోయే పాటలు ఏ రేంజ్‌లో ఉంటాయో చూడాలి.
#AK47 🔫 just got Loaded With Another Bullet from #KittuVissapragada ( lyricist)
joining the hilarious Ride 🔈📈🏆🙌🏿#Trivikram sir ✊@VenkyMama ⭐️@haarikahassine ✨@vamsi84 🧨#RadhaKrishna Gaaru ❤️🏋️♂️ pic.twitter.com/CgonngYjNQ— thaman S (@MusicThaman) May 23, 2026


