ఇది చాలా కాలం ట్రెండ్ అవుతుంది – థమన్!

ఇది చాలా కాలం ట్రెండ్ అవుతుంది – థమన్!

Published on Jan 23, 2024 6:05 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ గుంటూరు కారం. ఈ చిత్రం థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం లోని కుర్చీ మడతపెట్టి పాటకి ఆడియెన్స్ నుండి, ఫ్యాన్స్ నుండి సెన్సేషన్ రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రం కి మ్యూజిక్ అందించిన మ్యూజికల్ సెన్సేషన్ థమన్ ఒక ఇంట్రెస్టింగ్ వీడియో ను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఇది చాలా కాలం ట్రెండ్ అవుతుంది అంటూ కుర్చీ మడతపెట్టి పాటకి సంబందించిన రీల్స్ ను షేర్ చేశారు. ఇవన్నీ ఒకే వీడియో లో పోస్ట్ చేశారు. స్టార్ట్, రిపీట్ అంటూ చెప్పుకొచ్చారు. ఈ వీడియో విశేషం గా ఆకట్టుకుంటుంది. యంగ్ బ్యూటీ శ్రీ లీల హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం లో మీనాక్షీ చౌదరి, రమ్య కృష్ణ, ప్రకాష్ రాజ్, జయరామ్, జగపతి బాబు, ఈశ్వరి రావు లు కీలక పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు