“భగవంత్ కేసరి” లో గణేష్ అంథెం పై థమన్ ఇంట్రెస్టింగ్ పోస్ట్!

BhagavanthKesari
టాలీవుడ్ స్టార్ హీరో, నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో, స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ భగవంత్ కేసరి. ఈ చిత్రం లో కాజల్ అగర్వాల్, శ్రీ లీల లేడీ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. ఈ చిత్రం నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి ఇప్పటికే ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈ చిత్రం నుండి గణేష్ అంథెం ప్రోమో ను మేకర్స్ నిన్న రిలీజ్ చేయడం జరిగింది. ఈ ప్రోమో ఫుల్ ఎనర్జిటిక్ గా ఉంది. పూర్తి పాట సెప్టెంబర్ 1, 2023 న రిలీజ్ చేయనున్నారు మేకర్స్. మ్యూజికల్ సెన్సేషన్ థమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా థమన్ సోషల్ మీడియా లో ఈ పాట పై పోస్ట్ చేశారు. టపాకా, ఫైర్ సింబల్ లు కూడా పెట్టడం జరిగింది. ఈ సాంగ్ ఫ్యాన్స్ కు ఫుల్ ట్రీట్ లా ఉండే అవకాశం ఉంది. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అక్టోబర్ 19, 2023 న థియేటర్ల లో గ్రాండ్ రిలీజ్ కానుంది.

Exit mobile version