“గేమ్ ఛేంజర్” పై థమన్ సాలిడ్ కామెంట్స్ వైరల్

“గేమ్ ఛేంజర్” పై థమన్ సాలిడ్ కామెంట్స్ వైరల్

Published on May 23, 2024 10:00 AM IST

గ్లోబల్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా కియారా అద్వానీ (Kiara Advani) హీరోయిన్ గా ఇండియన్ జేమ్స్ కేమరూన్ శంకర్ తెరకెక్కిస్తున్న భారీ పొలిటికల్ అండ్ కమర్షియల్ డ్రామా “గేమ్ ఛేంజర్”. మెగా అభిమానుల్లో ఎప్పుడు నుంచో మంచి ఆసక్తి నెలకొల్పుకున్న ఈ చిత్రం నుంచి ఇప్పటివరకు అయితే ఒక్క ఫస్ట్ సింగిల్ మినహా పెద్ద అప్డేట్స్ రాలేదు.

కానీ సినిమాకి వర్క్ చేసిన వారి ఎక్స్ పీరియెన్స్ లను చెప్పడంతోనే మంచి హైప్ ని ఎక్కిస్తున్నారు. మరి లేటెస్ట్ గా ఈ సినిమా సంగీత దర్శకుడు థమన్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. గేమ్ చేంజర్ సాంగ్స్ అనే కాకుండా ప్రతి అంశం హైలైట్ గా ఉంటుంది అని శంకర్ గారు మళ్ళీ చాలా కాలం తర్వాత తన మార్క్ కమర్షియల్ సినిమాతో వస్తున్నారు.

ఖచ్చితంగా పెద్ద ఫీస్ట్ రాబోతుంది ఇది ప్రామిస్ అంటూ సాలిడ్ స్టేట్మెంట్ ని ఇచ్చాడు. దీనితో గేమ్ చేంజర్ విషయంలో మరోసారి ఫ్యాన్స్ లో ఆసక్తి నెలకొంది. ఇక ఈ భారీ చిత్రంలో అంజలి, శ్రీకాంత్, ఎస్ జె సూర్య తదితరులు నటిస్తుండగా దిల్ రాజు తమ బ్యానర్ లో 50వ సినిమాగా ప్రతిష్టాత్మకంగా నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు