బన్నీ ఫ్యాన్స్ కు సర్ప్రైజ్ ప్లాన్ చేసిన థమన్.!

Published on Sep 15, 2020 8:02 am IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పూజా హెగ్డేలు హీరో హీరోయిన్లు గా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సారథ్యంలో తెరకెక్కించిన ఎంటర్టైనింగ్ బ్లాక్ బస్టర్ “అల వైకుంఠపురములో”. ఇక ఈ ఏడాదికి ఈ చిత్రమే మన తెలుగు మరియు దక్షిణ భారతం నుంచి హైయెస్ట్ గ్రాసర్ అని చెప్పాలి. అయితే ఈ చిత్రం ఇంత పెద్ద విజయం అందుకోడానికి సంగీత దర్శకుడు థమన్ అందించిన సంగీతం కూడా ఎంత వరకు ప్రాధాన్యత పోషించిందో కూడా తెలిసిందే.

దీనితో ఈ చిత్రం ఓ ఎస్ టి(ఒరిజినల్ సౌండ్ ట్రాక్) ను విడుదల చేయాలని మ్యూజిక్ లవర్స్ మరియు బన్నీ అభిమానులు కోరగా థమన్ ఇప్పుడు విడుదల చేయనున్నట్టుగా తెలిపారు. అంతే కాకుండా సర్ప్రైజింగ్ గా ఈ చిత్రంలో ఉన్నవే కాకుండా కొన్ని వాడని సౌండ్ ట్రాక్స్ కూడా అందులో అందిస్తామని థమన్ తెలిపారు.ప్రస్తుతం పనులు జరుపుకుంటున్న ఈ సౌండ్ ట్రాక్స్ తొందరలోనే విడుదల చేయనున్నట్టుగా థమన్ తెలిపాడు.

సంబంధిత సమాచారం :

More