బాద్షా కోసం రాత్రంతా కష్టపడ్డ థమన్

బాద్షా కోసం రాత్రంతా కష్టపడ్డ థమన్

Published on Feb 14, 2013 8:34 AM IST

Thaman_Baadshah

ఇండస్ట్రీలో బిజీగా ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఇప్పుడు థమన్ చేతిలో చాలా పెద్ద సినిమాలు ఉన్నాయి. థమన్ ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ నటిస్తున్న ‘బాద్షా’ సినిమా మ్యూజిక్ ని ముగించే పనిలో ఉన్నాడు. ఈ సినిమా కోసం థమన్ చేయాల్సిన టైం కంటే ఎక్కువ సేపు పనిచేస్తున్నాడు. షూటింగ్ కి లేట్ అవ్వకూడదని నిన్న రాత్రంతా థమన్ తన టీంతో కలిసి పనిచేసి వర్క్ ఫినిష్ చేసారు.
‘బాద్షా సాంగ్స్ కోసం టీం తో కలిసి రాత్రంతా పనిచేసాను. వాటిని అదిరిపోయే లోకేషన్స్ లో షూట్ చేస్తారని ఆశిస్తున్నానని’ థమన్ ట్వీట్ చేసాడు.

ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్న దాని ప్రకారం ‘బాద్షా’ కోసం థమన్ సాలిడ్ మ్యూజిక్ ఇచ్చాడు, అలాగే ఈ సినిమా కోసం తను చాలా కష్టపడ్డాడని సమాచారం. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి శ్రీను వైట్ల డైరెక్టర్. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బండ్ల గణేష్ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు