‘తండేల్’ ఓటీటీ స్ట్రీమింగ్‌కి వచ్చేది అప్పుడే..!

‘తండేల్’ ఓటీటీ స్ట్రీమింగ్‌కి వచ్చేది అప్పుడే..!

Published on Feb 4, 2025 3:00 AM IST

అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘తండేల్’ ఫిబ్రవరి 7న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు చందూ మొండేటి డైరెక్ట్ చేస్తుండగా పూర్తి లవ్ స్టోరీ పీరియాడిక్ మూవీగా రానుంది. ఈ సినిమాను GA2 బ్యానర్‌పై బన్నీ వాస్ అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.

కాగా, ఈ సినిమాకు భారీ బడ్జెట్ అయ్యిందని.. అయితే, ఈ చిత్ర ఓటీటీ రైట్స్ రూపంలో సగానికంటే ఎక్కువగా రికవర్ అయినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఇక ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ మంచి ఫ్యాన్సీ రేటుకు దక్కించుకుందట. ఇక తండేల్ చిత్రం రిలీజ్ అయిన 50 రోజుల తర్వాతే ఓటీటీ స్ట్రీమింగ్‌కు రానున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, ఇప్పటికే రిలీజ్ అయిన పాటలకు సెన్సేషనల్ రెస్పాన్స్ దక్కింది. మరి భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు