సెంటిమెంట్ ను బ్రేక్ చేసినందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు: కళ్యాణ్ రామ్

సెంటిమెంట్ ను బ్రేక్ చేసినందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు: కళ్యాణ్ రామ్

Published on Mar 27, 2018 12:44 AM IST

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించిన తాజా చిత్రం ‘ఎంఎల్ఏ’ గత శుక్రవారం విడుదలై మంచి ఓపెనింగ్స్ రాబట్టి మొదటి మూడు రోజులకుగాను ప్రపంచవ్యాప్తంగా 7.03 కోట్ల షేర్ ను, రూ.12 కోట్ల గ్రాస్ ను రాబట్టి ఈ వారం బాక్సాఫీస్ వద్ద మొదటిస్థానంలో నిలబడింది.

ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్లో కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ నాకు ఎన్ని హిట్లొచ్చిన్న బయటి బ్యానర్ తో కలిసి సరైన విజయాన్ని అందుకోలేకపోయాననే అసంతృప్తి ఉండేది. అదొక సెంటిమెంట్ లా మిగిలిపోయింది. కానీ ‘ఎంఎల్ఏ’ చిత్ర విజయంతో ప్రేక్షకులు ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేశారు. వాళ్లందరికీ నా కృతజ్ఞతలు.

చాలా మంది ఫోన్ చేసి సినిమా ఎలాంటి కమర్షియల్ ఫార్మాట్లో ఉండాలో అలానే ఉంది అంటూ మెచ్చుకున్నారు. అది నాకు చాలా సంతోషాన్నిచ్చింది అన్నారు. బ్లూ ప్లానేట్ ఎంటర్టైనెంట్స్ పతాకంఫై ఈ చిత్రాన్ని భరత్ చౌదరి, కిరణ్ రెడ్డిలు నిర్మించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు