తమ బంధాన్ని ఆఫీషియల్ చేసిన తరుణ్-ఈషా..!

డైరెక్టర్-నటుడు తరుణ్ భాస్కర్, నటి ఈషా రెబ్బాల మధ్య గత కొంతకాలంగా వినిపిస్తున్న రూమర్స్‌కు ఎట్టకేలకు తెరపడింది. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ చాలా కాలంగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతున్నప్పటికీ, ఎవరూ అధికారికంగా స్పందించలేదు. అయితే, ‘ఓం శాంతి శాంతి శాంతిః’ చిత్రంలో భార్యాభర్తలుగా నటించిన ఈ జోడీ ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీతోనే కాకుండా, ప్రమోషన్స్ సమయంలోనూ అందరి దృష్టిని ఆకర్షించింది.

వరంగల్‌కు చెందిన వీరిద్దరూ కలిసి పలు సందర్భాల్లో కనిపించడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది.
​తాజాగా వినాయక చవితి పండుగ సందర్భంగా వీరిద్దరూ కలిసి ఉన్న ఒక ట్రెడిషనల్ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఎలాంటి అధికారిక ప్రకటన చేయకుండానే, ఈ పండుగ ఫోటో ద్వారా తమ బంధాన్ని వారు పరోక్షంగా కన్ఫర్మ్ చేశారని నెటిజన్లు భావిస్తున్నారు.

ప్రస్తుతం తరుణ్ భాస్కర్ ‘ఈఎన్‌ఈ రిపీట్’ చిత్రంతో బిజీగా ఉండగా, ఈషా రెబ్బా తన అప్ కమింగ్ ప్రాజెక్ట్స్‌తో ముందుకు వెళ్తున్నారు. ఏదేమైనా, ఈ లేటెస్ట్ ఫొటోతో వీరిద్దరి రిలేషన్‌షిప్‌పై ఉన్న కన్ఫ్యూషన్ కి పూర్తిగా ఫుల్‌స్టాప్ పడినట్లయింది.

Exit mobile version