సైలెంట్ గా ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘గాయపడ్డ సింహం’

Gaayapadda-Simham-1

మన టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకుడు అలాగే నటుడు తరుణ్ భాస్కర్ హీరోగా నటించిన రీసెంట్ చిత్రమే ‘గాయపడ్డ సింహం’. కొత్త దర్శకుడు కశ్యప్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ ఇంట్రెస్టింగ్ కామెడీ డ్రామా ఈ మే 1న థియేటర్స్ లో విడుదల అయ్యింది. కానీ ఈ చిత్రం ఊహించని విధంగా డిజప్పాయింట్మెంట్ నే మిగిల్చింది. ప్రమోషన్స్ తో మంచి బజ్ ని జెనరేట్ చేయగలిగినప్పటికీ సినిమాలో మేటర్ లేనందున ఆ మే 1న వచ్చిన అన్ని సినిమాలని ఆడియెన్స్ కి పక్కన పెట్టేస్తే అందులో ఇది కూడా ఒకటి.

ఇక ఎట్టకేలకి ఈ సినిమా మూడు వారాల్లోనే సైలెంట్ గా ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ఈ చిత్రాన్ని ఇవాళ్టి నుంచి ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో వారు స్ట్రీమింగ్ కి తీసుకొచ్చేసారు. సో ఈ కామెడీ స్పూఫ్ డ్రామాని చూడాలి అనుకునేవారు అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడొచ్చు. ఇక ఈ చిత్రంలో ప్రముఖ నటుడు జేడీ చక్రవర్తి కూడా నటించారు. అలాగే సప్త అశ్వ మీడియా వర్క్స్, జీ స్టూడియోస్ వారు నిర్మాణం వహించారు.

సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Exit mobile version