తరుణ్ భాస్కర్ సినిమా మొదలయ్యేది అప్పుడే !

తరుణ్ భాస్కర్ సినిమా మొదలయ్యేది అప్పుడే !

Published on Nov 8, 2020 3:01 AM IST

యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తో విక్టరీ వెంకటేష్ ఆ మధ్య ఓ ప్రాజెక్ట్ చేయాలనుకోవడం, పైగా తరుణ్ భాస్కర్ స్క్రిప్ట్‌ ను కూడా పూర్తి చేయడం.. అలాగే ఆ ఫుల్ స్క్రిప్ట్ ను వెంకటేష్ కి కూడా వినిపించడం తెలిసిన విషయాలే. అయితే స్క్రిప్ట్ విన్న వెంకీ మరియు సురేష్ బాబు ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారని ఆ మధ్య వినిపిచింది. కాకపోతే ఈ సినిమా వచ్చే ఏడాది దసరా తరువాత ఉంటుందట. నారప్ప షూటింగ్ పూర్తవ్వగానే ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది.

కాగా తరుణ్ భాస్కర్ తో విక్టరీ వెంకటేష్ సినిమా హార్స్ రేసింగ్ నెపథ్యంలో సాగుతుందని, చాలా వరకు సినిమాలో మంచి ఎంటర్ టైన్మెంట్ ఉంటుందని తెలుస్తోంది. మొత్తానికి ‘వెంకీ’ నుండి కొత్త బ్యాక్ డ్రాప్ లో వస్తోన్న ఈ సినిమా కోసం వెంకీ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇకపోతే ఈ చిత్రాన్ని వెంకీ హోమ్ బ్యానర్ సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు