మహేష్ ఒక్కడు దెబ్బకి నంబర్ మార్చేసిన నిర్మాత

Published on Jun 4, 2020 11:33 am IST

2003లో సంక్రాతి కానుకగా వచ్చిన ఒక్కడు ఓ ప్రభంజనం. మహేష్ కి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చిపెట్టిన సినిమా అది. టాలీవుడ్ అతిపెద్ద బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన ఒక్కడు సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహించగా, భూమిక హీరోయిన్ గా చేసింది. కాగా ఈ సినిమాలో మహేష్ గ్యాంగ్ మరియు కమెడియన్ ధర్మవరపు సుబ్రమణ్యం మధ్య ఓ కామెడీ సన్నివేశం ఉంటుంది.

సినిమాలో కేవలం కొద్ది నిముషాలు ఉండే ఆ సన్నివేశం మంచి హాస్యం పండించి బాగా ఫేమస్ అయ్యింది. ఈ సన్నివేశం ఓ ఆసక్తికర ఘటనకు కారణం అయ్యింది. భూమిక పాస్ పోర్ట్ కోసం, పాస్ పోర్ట్ ఆఫీసర్ సుబ్రమణ్యం దగ్గరకు మహేష్ గ్యాంగ్ వస్తారు. పాస్ పోర్ట్ చేతికి ఇవ్వడం కుదరదు అన్న ఆయన అదే సమయంలో… ఆయన కొత్తగా కొన్న ఫోన్ కి లవర్ మొదటి కాల్ చేయాలని, రొమాంటిక్ గా తన ఫోన్ నంబర్ చెవుతాడు. చేతికి పాస్ పోర్ట్ ఇవ్వడం కుదరదు అన్న సుబ్రమణ్యాన్ని ట్రిక్ లో పడేయాలని మహేష్ గ్యాంగ్ ఆయన కొత్త సెల్ ఫోన్ కి కాల్స్ చేసి ఆడుకుంటారు. ప్రతి సారి తన లవర్ ఫోన్ చేసిందని ఫోన్ ఎత్తి, రాంగ్ కాల్స్ తో విసిగిపోయిన సుబ్రహ్మణ్యం ఫోన్ బద్దలు కొడతాడు.

ఆ సన్నివేశంలో సుబ్రమణ్యం రొమాంటిక్ గా చెప్పిన ఫోన్ నంబర్ ఆ చిత్ర నిర్మాత ఎం ఎస్ రాజు గారిది అట. ఒక్కడు విడుదల తర్వాత ఆయనకు రోజుకు అనేకమంది కాల్స్ చేస్తూ ఉండేవారట. దీనితో చేసేదేమీ లేక ఆయన తన ఫోన్ నంబర్ మార్చుకున్నారట.

సంబంధిత సమాచారం :

More