హీరోల విషయంలో అలా జరగదు – తాప్సీ

హీరోల విషయంలో అలా జరగదు – తాప్సీ

Published on Jun 7, 2026 7:03 AM IST

Taapsee Pannu

గ్లామర్ బ్యూటీ తాప్సీ చాలా బోల్డ్ గా ఉంటుంది. ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతుంది. సోషల్‌ మీడియాకు దూరంగా ఉండటమనేది తన వ్యక్తిగత నిర్ణయమని అంటోంది ఈ బ్యూటీ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ‘గాంధారి’ చిత్రంతో బిజీగా ఉన్న తాప్సి మాట్లాడుతూ.. ‘ఆన్‌లైన్‌లో తక్కువగా కనిపించాలని గతేడాది నిర్ణయం తీసుకున్నా. నిజానికి కారణం ఏమి లేదు. ఇది పూర్తిగా నా వ్యక్తిగత కారణాల వల్ల తీసుకున్నది. సోషల్‌ మీడియా ఒక పరుగు పందెంలా అనిపించడం మొదలైంది.

అందుకే నా జీవితాన్ని నేను జీవించడానికి, నా మనశ్శాంతిని కాపాడుకోవడానికి ఏడాది పాటు దీనికి దూరంగా ఉన్నా. నా కెరీర్ విషయానికి వస్తే.. నేను పాతికేళ్ల వయసులో హిందీ పరిశ్రమకి వచ్చాను. మంచి పాత్రలు దక్కించుకోవడానికే మూడు నాలుగేళ్లు కష్టపడాల్సి వచ్చింది. ఈ లోపు 30ఏళ్లు దాటిపోయాయి. రొమాంటిక్‌ కామెడీ సినిమాల్లో నటించడానికి మీరు తగినంత వయసులో లేరని అన్నారు. హీరోల విషయంలో మాత్రం ఇలా జరగదు. వయసును బట్టి వివక్ష చూపడం అనేది పెద్ద సమస్య’ అని తాప్సీ తెలిపింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు