నిఖిల్ పక్కన ఆ హీరోయిన్ నటించబోతోంది !

నిఖిల్ నటిస్తోన్న కనితన్ రీమేక్ షూటింగ్ ఇటీవల మొదలయ్యింది. ఠాగూర్ మధు నిర్మిస్తోన్న ఈ సినిమాను తమిళ్ డైరెక్టర్ సంతోష్ దర్శకత్వం వహిస్తున్నాడు. రిపోర్టర్ పాత్రలో నిఖిల్ ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. తాజా సమాచారం మేరకు ఈ సినిమాలో సురభి హీరోయిన్ గా నటించబోతోందని సమాచారం.

విద్యా వ్యవస్థలోని లోపాలను వేలెత్తి చూపిస్తూ ఇన్వెస్టిగేటివ్ తరహాలో ఆద్యంతం ఆసక్తిగా ఈ సినిమా సాగాబోతోంది. ముద్ర అనే టైటిల్ ను ఠాగూర్ మ‌ధు ఈ సినిమా కోసం రిజిస్ట్ర‌ర్ చేయించారు. రేపు నిఖిల్ నటించిన కిరాక్ పార్టి సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శరణ గోపిసేట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి విజయం సాధించి నిఖిల్ కు మంచి పేరు తెచ్చిపెట్టాలని కోరుకుందాం.

Exit mobile version