ముగ్గురూ ఒక్కడేనా…, వేరు వేరా? బిగిల్ లో అసలు ట్విస్ట్ అదే…!

Published on Oct 24, 2019 7:05 am IST

ఇంకా కేవలం మరో 24గంటలలో బిగిల్ మూవీ ప్రపంచం వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రాన్ని 4200థియేటర్స్ లలో విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. భారీ అంచనాల మధ్య విడుదల అవుతున్న ఈచిత్రం రికార్డు వసూళ్లు సాధించడం ఖాయంగా కనిపిస్తుంది.

బిగిల్ మూవీలో విజయ్ మూడు భిన్న వయసులలో, వైవిధ్యమైన గెటప్ లలో కనిపించడంతో కథ పై ఆసక్తి పెరుగుతుంది. బిగిల్, మైఖేల్, రాజప్ప అనే మూడు పాత్రలలో విజయ్ కనిపిస్తున్నారు. బిగిల్ యంగ్ ఫుట్ బాల్ ప్లేయర్ లా, మైకేల్ కోచ్ గెటప్ లో, ఇక రాజప్ప మెడలో సిలువ, నుదుటున బొట్టుతో 50ప్లస్ ఏజ్ లో కనిపిస్తున్నారు. ఐతే ఈ మూడు ఒక్కరేనా, లేక వేరు వేరా అనేది ఆసక్తి కరంగా ఉంటుంది.

ట్రైలర్ చూస్తుంటే ఒకప్పుడు బిగిల్ అనే స్టార్ట్ ఇండియన్ ఫుట్ బాల్ ప్లేయర్ మైఖేల్ పేరుతో విమెన్ టీమ్ కోచ్ గా వస్తారనిపిస్తుంది. మైఖేల్ రౌడీలా ఎందకు మారాడు, అసలు రాజప్ప కథేమిటీ అనేవి కథలో కీలక మలుపులు. దర్శకుడు అట్లీ తెరకెక్కించిన ఈ మూవీలో నయనతార హీరోయిన్ గా నటించగా, రెహ్మాన్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :

More